న్యూఢిల్లీ : ఉగ్రవాద చర్యల నేపథ్యంలో ప్రపంచమంతా కలిసి పాకిస్థాన్‌ను ప్రత్యేకించి ఆర్థికంగా ఏకాకిని చేయాల్సి ఉం దని భారతదేశం కోరింది. ముందుగా పా కిస్థాన్‌కు ఆర్థిక నిధుల చేరవేత నిలిచిపోవాల్సి ఉంది. రుణాలు , గ్రాంట్ల నిలిపివే త నిర్ణయాలు తీసుకోవల్సి ఉందని, ఈ దిశలో బహుళ స్థాయి ఆర్థిక సంస్థలు త క్షణం స్పందించాల్సి ఉంటుందని భారత ప్రభుత్వం శనివారం అధికారికంగా స్పం దించింది. ఇటీవలే కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పౌరులను వధించారు.ఈ హేయమైన అ నాగరిక, ఆటవిక చర్య మూలాలు పాకిస్థాన్‌లో ఉన్నాయి. అక్కడి ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం
అంతర్జాతీయ స్థాయిలో అందే ఇతరత్రా నిధుల నుంచి భారీ సొమ్మును కేటాయిస్తోంది.ఈ క్రమంలో ఈ ఉగ్రవాదులు బరి తెగించి సీమాంతర దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ చర్య అంతర్జాతీయ కట్టుబాట్లకు విఘాతం కల్పించేదిగా మారింది. ఇక దీనిని ఎ సంస్థ కూడా ఉపేక్షించరాదు.
వెంటనే స్పందించి , అనధికారిక ఉగ్రదేశం అయిన పాకిస్థాన్‌కు రుణాలు, గ్రాంట్లను నిలిపివేయాల్సి ఉందని భారత ప్రభుత్వం కోరిందని అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. నిధుల నిలిపివేత జరిగితే పాకిస్థాన్ పరిస్థితి నీళ్లు ఎండిన చెరువు అవుతుంది ఇక ఉగ్ర తిమింగలాలు కొట్టుకుంటూ బయటకు వస్తాయని భారతదేశం తెలిపింది. పాకిస్థాన్‌కు ఐఎంఎప్, ప్రపంచ బ్యాంక్ ఇతరత్రా ఏ ఆర్థిక సంస్థ నుంచి సాయం అందకుండా చర్యలు తీసుకోవల్సి ఉంది. ఈ విషయంలో పాకిస్థాన్‌ను ఏకాకిని చేసేందుకు పలు ప్రపంచ స్థాయి వేదికలు, సంస్థలు , ఐఎంఎఫ్, ఐరాస వంటి కీలక అంతర్జాతీయ విభాగాలు స్పందించాల్సి ఉందని భారత్ పేర్కొంది. ఒక్కరోజు క్రితమే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ సమావేశంలో మాట్లాడుతూ పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఊతం అంతకు మించి ఆజ్యం పోస్తున్న పోకిరి , అరాచక దేశంగా మారిందని విమర్శించారు. దొంగచాటు దాడులతో వీరత్వం ప్రదర్శించడం ఇందుకు పాకిస్థాన్ ప్రభుత్వ తోడ్పాటు అందడం శోచనీయం అని తెలిపారు. కాగా ఇటువంటి ఉగ్ర చర్యల దేశానికి కట్టడి లేకుండా విర్రవీగేలా చేయడం వెనుక ప్రపంచ దేశాల వైపల్యం దండిగా కన్పిస్తోందన్నారు.