Saturday, December 7, 2024

ఫ్యాషన్ ఐకాన్‌గా మెరుస్తూ…

- Advertisement -
- Advertisement -

అందాల తార రకుల్‌ప్రీత్ సింగ్ సరికొత్త ఫ్యాషన్ ఐకాన్‌గా మారింది. ముంబయ్‌లో ఏ ఫ్యాషన్ ఈవెంట్ జరిగినా ఈ భామను పిలుస్తున్నారు. ఏ అవార్డు ఫంక్షన్ నిర్వహించినా రకుల్ ఉండాల్సిందే. ఈ ఈవెంట్స్‌కి ఆమె ఫ్యాషనబుల్ డ్రెస్సులు ధరించి హాజరవుతోంది. అలా ఫ్యాషన్ ఐకానయింది. అయితే తాజాగా జీక్యూ మ్యాగజైన్ అవార్డు ఫంక్షన్‌లో ఈ బ్యూటీ తన అందాలను ప్రదరిస్తూ ఒక రేంజ్‌లో రెచ్చిపోయింది. ఈ ఈవెంట్‌కి హాట్ డ్రెస్సులు ధరించి పలువురు బాలీవుడ్ భామలు విచ్చేసినా అందరి చూపులు మాత్రం రకుల్ పైనే. తన డ్రెస్సింగ్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. బాలీవుడ్‌లో ఈ భామ హీరోయిన్‌గా బిజీగానే ఉంది. అయితే సక్సెస్‌లు మాత్రం పెద్దగా లేవు. అయినా కూడా ఆమెకి ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News