Thursday, January 26, 2023

చరణ్ బర్త్ డే కానుకగా…

- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్‌గా స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉండగా అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రం నుంచి చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ అవైటెడ్ ఫస్ట్ లుక్ మార్చి 27న చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయనున్నట్టుగా తెలిసింది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ తొందరలోనే రానున్నట్టుగా సమాచారం. మొత్తానికి అయితే చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ తరుణం అతి త్వరలోనే ఉండనుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తమ బ్యానర్ లో 50 వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles