Sunday, October 6, 2024

#RC16 కోసం చరణ్ నయా లుక్.. పోటో షేర్ చేసిన మేకర్స్

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన చరణ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. తన తర్వాత చిత్రం ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.త్వరలోనే షూటింగ్ ప్రారంభిచనున్నారు మేకర్స్.

అయితే.. ఈ సినిమాకు చరణ్ తన లుక్ ను మార్చబోతున్నాడు. అస్ట్రేలియాలో మేకోవర్ అవుతున్నారు చరణ్​.ఈ మేరకు సోమవారం రామ్ చరణ్ బ్యాక్ లుక్ తో ఓ ఫొటో రిలీజ్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. తన పాత్ర కోసం రామ్ చరణ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభవుతుందని వెల్లడించింది. ‘ఆర్సీ16’ ఓ మెగా మాసివ్ మూవీ అంటూ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News