Thursday, January 26, 2023

చంద్రబాబుపై రామ్ గోపాల్ వర్మ ఫైర్..

- Advertisement -

హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా విమర్శించారు. ప్రజల ప్రాణాల కంటే పబ్లిసిటినే చంద్రబాబుకు ముఖ్యమని ఆయన మండిపడ్డారు. విశాలమైన ప్రాంతాల్లో సభలు పెడితే తక్కువ జనాలు వస్తే.. తన పాపులారిటీ తగ్గిపోతుందనే భయంతో ఇరుకు సందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలను చంద్రబాబు తీశారని ఆయన ధ్వజమెత్తారు.

తన కోసం ఇంతమంది వచ్చి ప్రాణాలు కోల్పోయారంటూ చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు చంద్రన్న కానుకలు అంటూ బిస్కెట్లు వేసి వారి ప్రాణాలను బలిగొన్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును తొలిసారిగా గారు అని కాకుండా నువ్వు అని సంబోధిస్తున్నానని అన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి సభలు ఎక్కడ పెట్టాలో తెలియదా? అని ఆయన నిలదీశారు. హిట్లర్, ముస్సోలిని తర్వాత అలాంటి వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles