Friday, May 3, 2024

నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మన దేశంలో రంజాన్ మాసం మంగళవారం నుండి ప్రారంభమయ్యింది. పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక, సౌదీ అరేబియాలో ఆదివారం సాయంత్రం కనిపించింది దీంతో సౌదీతో పాటు పలు గల్ఫ్ దేశాల్లో సోమవారం నుండి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), ఖతార్ కూడా సోమవారం రంజాన్ మొదటి రోజు అని ప్రకటించాయి. ఇక భారత దేశంలో మార్చి 12 నుండి ఉపవాసాలను పాటిస్తున్నారు.

భారత దేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో కూడా, పవిత్ర రంజాన్ మాసం మార్చి 12, మంగళ వారం నుండి ప్రారంభమవుతుంది. ఈ నెలలో ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. రంజాన్ సమయంలో ఉపవాసం ఉండటం ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది నెల ప్రారంభం, ముగింపును నిర్ణయించడంలో కీలకమైనది నెలవంక మాత్రమే. రంజాన్ మాసం ముగిసిన తరువాత ముస్లింలు ఈద్- ఉల్ -ఫితర్ పండుగను జరుపుకుంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News