Monday, December 2, 2024

అద్భుతం అనిపించే పాట

- Advertisement -
- Advertisement -

విజువల్ వండర్స్‌ని ఇండియన్ సినిమాకు పరిచయం చేసిన దర్శకుడు శంకర్. సిజీ, వీ.ఎఫ్.ఎక్స్‌ల గురించి పెద్దగా పరిచయం లేని రోజుల్లోనే వెండితెరపై అద్భుతాలు సృష్టించి ప్రేక్షకులని ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో పాటలకు ప్రత్యేక ఆకర్షణ. ఆయన చిత్రీకరించిన చాలా పాటలు ఇప్పటికీ ఫ్రెష్ గా వుంటాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలోనూ ఓ అద్భుతం అనిపించే పాట వుంది. ఇటీవలే ఓ పాట చిత్రీకరణ కోసం న్యూజిలాండ్ వెళ్లిన చిత్రబృందం… అక్కడ షెడ్యూల్‌ని పూర్తి చేసింది. ఈ పాట రామ్ చరణ్ కెరీర్‌లో అంత్యంత లావిష్ సాంగ్‌గా వుండబోతుందని తెలిసింది. రామ్ చరణ్ కెరీర్‌లో విజువల్ ట్రీట్ లాంటి పాటలు అంటే ‘మగధీర’లో ధీర ధీర, ‘ఆరెంజ్’ ఆల్బమ్ లో కొన్ని పాటలు చెబుతారు. అయితే శంకర్ మాత్రం చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ అనుకునే పాటని షూట్ చేశారని చెబుతున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News