Wednesday, April 24, 2024

వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన రాందేవ్

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహిళలు దుస్తులు ధరించకపోయిన బాగుంటారనే అనే వ్యాఖ్యలపై రాందేవ్‌బాబా క్షమాపణలు చెప్పారు. రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్ర మహిళా కమిషన్ రాందేవ్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని, తాను చేసిన వ్యాఖ్యలకు మహిళలు బాధపడినట్లయితే క్షమించాలని ట్విట్టర్‌లో మహిళ కమిషన్ చైరపర్సన్ రుపాలీ చకాంకర్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమాలను ప్రోత్సహించానని, మహిళా సాధికారక కోసం తాను ఎల్లప్పుడు కృషి చేశానని చెప్పారు. మహిళలను అగౌరవంగా చూడలేదన్నారు. సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో తనది కాదన్నారు.

అసలు ఏం జరిగిదంటే….

ఒంటిమీద దుస్తులు లేకపోతే మహిళలు బాగుంటారని ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా నోరుజారారు. మహారాష్ట్రలోని థానేలో మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరానికి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, పలువురు మహిళలు, రామ్‌దేవ్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌దేవా బాబా ప్రసంగించారు. యోగా చేసిన అనంతరం మహిళలు యోగా దుస్తులు మార్చుకునేందుకు సమయ దొరకకపోవడంతో చీరలు ధరించలేదన్నారు. మహిళలు చీరల్లో, సల్వార్ సూట్‌లలో అందంగా ఉంటారని మెచ్చుకున్నారు. మహిళలు దుస్తులు ధరించకపోతే ఇంకా బాగు ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్నవారు అసహనానికి గురయ్యారు. సోషల్ మీడియాలో రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News