Wednesday, October 9, 2024

‘రాక్షస రాజా‘గా రానా

- Advertisement -
- Advertisement -

పవర్‌హౌస్ యాక్టర్ రానా, క్రియేటివ్ డైరెక్టర్ తేజ కాంబినేషన్‌లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి‘ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ‘రాక్షస రాజా‘తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదివరకూ ఎన్నడూ చూడని క్రైమ్ వరల్డ్‌ని ఎక్స్‌ఫ్లోర్ చేస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా అద్భుతమైన సమ్మేళనంగా ఈ సినిమా ఉండనుంది. రానా పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ను పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇందులో రానా తన భుజంపై భారీ తుపాకీని పట్టుకుని మరో భుజంపై బుల్లెట్లతో కనిపించారు. విభూతి, తిలకం ధరించి, నోటిలో సిగార్‌తో వైల్డ్‌గా కనిపించారు. వేళ్లకు రెండు పొడవాటి బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఓవరాల్‌గా రానా లుక్ అద్భుతంగా అలరిస్తోంది. ఈ గ్యాంగ్‌స్టర్ చిత్రంలో మునుపెన్నడూ లేని విధంగా సినిమాటిక్ జర్నీని ప్రేక్షకులు ఆశించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News