Sunday, September 15, 2024

నార్సింగిలో దారుణం… బార్బర్ గొంతు కోసి… హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. రాజు (50) అనే బార్బర్ ను మరో బార్బర్ అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు.  అనంతరం నిందితుడు నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు మృతుడికి బంధువుగా గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News