Thursday, April 25, 2024

’రాంగో రంగ’ అంటున్న నాచురల్ స్టార్…

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ’అంటే సుందరానికి’. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగల్ పంచెకట్టు, సెకెండ్ సింగల్ ఎంత చిత్రం పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ ’రాంగో రంగ’ పాట లిరికల్ వీడియోని ఈనెల 23న చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాని నుదురుపై బ్యాండెయిడ్‌తో తన సైకిల్‌ని ఎత్తిపట్టుకొని అయోమయంగా చూడటం ఆసక్తికరంగా అనిపించింది. అదే సమయంలో సుందరం పాత్రలోని కామిక్ టచ్‌ని చూపిస్తుంది. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనుంది. జూన్ 10న తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Rango Ranga lyrical song release on May 23

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News