Tuesday, October 15, 2024

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుమిదిని

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఎఎస్ అధికారి రాణి కుమిదిని నియమితులయ్యారు. 1988 బ్యాచ్‌కు చెందిన రాణి కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసుల అనంతరం రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. ఆమె 2023 ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అదే హోదాలో కొనసాగించింది. తాజాగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుమిదినిని నియమించింది.

ఎస్‌ఇసిగా ఉన్న పార్థసారధి పదవీ కాలం ఈ నెల 8వ తేదీతో ముగిసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుమిదినిని నియమించారు. ఈ మేరకు రాణి కుముదినిని ఎస్‌ఇసిగా నియమిస్తూ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతన ఎస్‌ఇసి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News