Saturday, April 13, 2024

పుష్ప-2లో నా పాత్ర వెరీ స్పెషల్: రష్మిక

- Advertisement -
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప2పై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్‌బస్టర్ పుష్ప సినిమాలో బన్నీ పాత్రతో పాటు రష్మకి మందన్న పోషించిన శ్రీవల్లి పాత్ర కూడా చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. పుష్ప సినిమా చివర్లో హీరో, హీరోయిన్ పెళ్లి అయినట్లుగా చూపించారు. కనుక పుష్ప2లో బన్నీకి రష్మిక భార్యగా కనిపించబోతుంది. పుష్ప2పై తాజాగా రష్మికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ… ‘ఈ సినిమాలో పుష్ప రాజ్ భార్య పాత్రలో కనిపించబోతున్నాను. పెళ్లి తర్వాత సహజంగానే బాధ్యతలు పెరుగుతాయి. నా ప్రాతలో మంచి నటన కనబరుస్తాను. సుకుమార్ ప్రతి సన్నివేశాన్ని, ప్రతి షాట్ ను కూడా ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు’ అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News