పాన్ ఇండియా సినిమాలతో మోస్ట్ సక్సెస్ఫుల్ కెరీర్‌ని ఎంజాయ్ చేస్తోంది రష్మిక (Rashmika Mandanna). యానిమల్, పుష్ప-2, ఛావా వంటి హిట్స్‌తో ఈమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న చిత్రాల్లో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఒకటి కాగా, ఇంకొటి ‘థామా’. థామా చిత్రంలో రష్మిక తొలిసారిగా హారర్ పాత్రలో కనిపించనుంది. స్త్రీ, ముంజియా, బెడియా వంటి సినిమాల ఫ్రాంచైజీలో ఈ సినిమా రాబోతుంది. కొద్ది రోజుల క్రితమే ‘ది వరల్డ్ ఆఫ్ థామా’ అంటూ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఇప్పుడు రష్మిక (Rashmika Mandanna) మరో క్రేజీ ఫ్రాంచైజీలో భాగం కానుందని వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ్లో ‘కాంచన’ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్ తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీలో వచ్చి ముని, కాంచన, కాంచన-2 (గంగా), కాంచన-3 సినిమాలు మంచి సక్సెస్ సాధించాడు. ఈ వరుసలో వస్తున్న మరో చిత్రం కాంచన-4. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోందని ఇదివరకే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో రష్మిక కూడా నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. అది కూడా దెయ్యం పాత్రలో అని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ, ఇదే నిజమైతే.. కాంచన-4 క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది.
Also Read : ‘ఎన్టిఆర్-నీల్’ మూవీ క్రేజీ అప్డేట్.. హీరోయిన్ ఫిక్స్..