Wednesday, September 18, 2024

బ్లాక్ బస్టర్ కాంబో ఈజ్ బ్యాక్..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజ రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల కాంబినేషన్ లో నాలుగో చిత్రం తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.#ఆర్ టి4జిఎం పేరుతో బ్లాక్ బస్టర్ కాంబో ఈజ్ బ్యాక్ అంటూ ఈ మూవీకి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే రవితేజ, గోపిచంద్ కాంబినేషన్ లో ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.

వీరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతుండడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను  త్కరలోనే వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.

Also Read: మరో ‘అర్జున్ రెడ్డి’లా ‘సిద్ధార్థ్ రాయ్’… టీజర్ కు కనెక్ట్ అవుతున్న యూత్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News