Thursday, May 2, 2024

రవితేజ ‘రావణాసుర’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Ravi Teja 'Ravanasura' begins

మాస్ మహారాజ రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్ బ్యానర్స్‌పై సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రావణాసుర‘ . ఈ చిత్రం శుక్రవారం బోగి సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు అనంతరం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు స్క్రిప్ట్ అందించారు. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి క్లాప్ నివ్వగా, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకులు కె.యస్.రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. ‘రావణాసుర’ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.

ఈ పోస్టర్‌లో రవితేజ వైట్ షర్ట్, కోటు వేసుకొని సిగరెట్ వెలిగిస్తుండగా షర్ట్‌పై బ్లడ్, ఫైర్ కనిపిస్తుంది.. శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో రామ్‌గా నటిస్తుండగా, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్ , ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించారు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించే ఈ చిత్రానికి సంగీతంః హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్, కెమెరాః విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్‌ః శ్రీకాంత్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News