Thursday, April 25, 2024

రవితేజ ‘రావణాసుర’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

ధమాకా, వాల్తేరు వీరయ్యలో రెండు విభిన్నమైన పాత్రల్లో అలరించిన మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న తన తాజా చిత్రం ‘రావణాసుర’ లో యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో గ్రాండ్‌గా రూపొందుతోంది.

రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్ ఈ చిత్రంలో రవితేజ పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ ని విడుదల చేశారు. రవితేజ డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించారు. లాయర్‌గా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే మరో గెటప్‌లో స్టైలిష్‌గా ఆకట్టుకున్నారు. రెండు గెటప్‌లలో సిగార్ తాగుతూ కనిపించారు. ఓ అజ్ఞాత వ్యక్తి అమ్మాయిలను చంపడం కూడా వీడియోలో కనిపిస్తుంది. టీజర్ అవుట్ స్టాండింగ్ గా వుంది. రవితేజ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని సూచిస్తోంది.

Ravi Teja Ravanasura First Glimpse Outసుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఏప్రిల్ 7, 2023న వేసవిలో రావణాసురు థియేటర్స్ లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News