Sunday, July 6, 2025

ఆర్‌సిబిలో కీలక మార్పు.. జట్టులోకి జింబాబ్వే బౌలర్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపిఎల్ (IPL) 18వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి ఆర్హత సాధించింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించడంతో పంజాబ్, ఢిల్లీతో పాటు ఆర్‌సిబి (RCB)  ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఆర్‌సిబి టీం పకడ్భందీగా ఉంది. అయితే కొందరు ఆటగాళ్లు తమ స్వదేశం కోసం ఆడాల్సి రావడంతో జట్టును వీడి వెళ్లక తప్పడం లేదు. ఇప్పుడు ఆర్‌సిబికి ఇలాంటి సమస్యే ఎదురైంది. తాజాగా ఆర్‌సిబి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని (Blessing Muzarabani) తో ఒప్పందం కుదుర్చుకుంది.

సౌతాఫ్రికా ఆటగాడు లుంగి ఎంగిడి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందకు స్వదేశానికి వెళ్లిపోయాడు. దీంతో ఎంగిడి స్థానంలో జింబాబ్వేకు చెందిన బ్లెస్సింగ్ ముజరబానీని జట్టులోకి తీసుకుంది. లక్నోతో జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముజరబానీ అందుబాటులో ఉంటాడు. ఇక ఎంగిడి ఈ సీజన్‌లో ఆర్‌సిబి తరఫున కేవలం ఒక మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. చెన్నైతో జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలింగ్ వేసిన అతను 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఎంగిడి స్థానంలో ముజరబాని జట్టులోకి తీసుకోవడంతో ఇది ముజరబానికి సువర్ణావకాశం అని చెప్పుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News