లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 18వ సీజన్‌లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో(SRH) జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నోపై ఇదే వేదికలో ఘన విజయం సాధించిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకోవాలని అనుకుంటోంది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్(SRH) జట్టు మూడు మార్పులు చేసింది. ట్రావిస్ హెడ్, అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కట్‌లను జట్టులోకి తీసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి(RCB) కెప్టెన్సీ బాధ్యతలను జితేష్ శర్మకు అప్పగించింది. రజత్ పటిదర్ ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండనున్నాడు. దేవ్‌దవ్ పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ని జట్టులోకి తీసుకుంది.