Friday, September 20, 2024

అనకాపల్లి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు.. 14 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం సంభవించింది. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మందికి పైగా గాయాల య్యాయి. బాధితులను ఆస్పత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు సమయంలో 300 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.

కార్మికులు షిఫ్టు మారే సమయంలో ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలుడు ధాటికి కంపెనీ మొదటి అంతస్తు శ్లాబ్ కూలింది. కార్మికుల మృతదేహాలు ఛిద్రమైపోయాయి. మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాధి తులను అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు సమాచారం.

కాలిన గాయా లతో ఏడుగురు మృతి చెందగా, మొదటి అంతస్తు శ్లాబు పడి ఏడుగురు మృతి చెందారు. గాయపడ్డ వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శ్లాబు కూలిపోయిందని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు కార్మికులు చెబుతున్నారు. మూడో అంతస్తులో చిక్కుకున్న కార్మికులను క్రేన్ సాయం తో బయటకు తీసుకొచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

పరిశ్రమ ఆవరణమంతా దట్టంగా పొగలు అలుముకున్నా యి. భారీ పేలుడు శబ్ధాలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కార్మికులు హాహాకారాలు చేస్తూ పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. భారీ పేలుడు ధాటికి వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 11 ఫైరిం జన్లు మంటలను అదుపు చేశాయి. ఉన్నతాధికారులు పరిశ్రమ వద్దకు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. పేలుడుకు గల కారణాలను కార్మి కులను అడిగి తెలుసుకున్నారు.

సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సిఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడారు. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అచ్యుతాపురం సెజ్ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. బాధితులకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ప్రమాద ఘటనపై భగ్గుమన్న కార్మిక సంఘాల నేతలు
భద్రతా ప్రమాణాల లోపం వల్లే ఈ ఘటన జరిగిందని, సెజ్‌లో వరుస ప్రమాదాలు జరుగుతున్నా, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ, పొల్యూషన్ బోర్డు, ఫైర్ డిపార్ట్‌మెంట్ పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ‘భారీ ఎత్తున ప్రమాదం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక కార్మికులు పరుగులు తీశారు. అయినా ప్రాణాలు కాపాడుకోలేకపోయాలి. సెజ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని చుట్టు ప్రాంతాల ప్రజలు క్షణం క్షణం భయపడుతున్నారు. కంపెనీలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాల’ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News