Monday, July 7, 2025

క్రైమ్ థ్రిల్లర్, భావోద్వేగ డ్రామాతో.

- Advertisement -
- Advertisement -

తమిళంలో ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన డీఎన్‌ఏ సినిమాను ఎస్. కె. పిక్చర్స్ ద్వారా అభిరుచి గల నిర్మాత సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సినిమా తెలుగులో ‘మై బేబి’ (My baby) పేరుతో జూలై 11న విడుదల కానుంది. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ’షాపింగ్ మాల్ ’, ’పిజ్జా’ వంటి విజయవంతమైన 15 చిత్రాలను నిర్మాతగా విడుదల చేసిన సురేష్ కొండేటి గతంలో డిస్ట్రిబ్యూటర్‌గా 85 పైగా చిత్రాలను విడుదల చేశారు. ఇప్పుడు నిర్మాతగా 16వ చిత్రంగా ‘మై బేబీ’ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ‘నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో తమిళంలో ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. అధర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్,(Crime thriller) భావోద్వేగ డ్రామాతో కూడిన గ్రిప్పింగ్ కథాంశంతో ఆకట్టుకుంది. 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News