Tuesday, December 6, 2022

కెసిఆర్ కిట్‌తో తల్లీబిడ్డలకు భరోసా

- Advertisement -

 

మన తెలంగాణ మహబూబాబాద్: ఆడబిడ్డల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ గుగులోతు రవి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలోని డిఎస్‌ఆర్ జెండాల తండా గ్రామ పంచాయితీ పరిధిలోని బొత్తల తండాకు చెందిన గుగులోతు కళ్యాణికి డా. రవి రెండవ కాన్పు సుఖ ప్రసవం చేయగా ఆడబిడ్డ జన్మించింది. ఈ మేరకు ఆమెకు బుధవారం 15 వస్తువులతో కూడిన కెసిఆర్ కిట్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సుఖ ప్రసవాలు జరుగుతాయన్నారు. మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా కెసిఆర్ కిట్ పథకాన్ని సిఎం కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కెసిఆర్ కిట్‌తో తల్లీబిడ్డలకు భరోసా అని తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవం అయి ఆడబిడ్డ జన్మిస్తే రూ. 13 వేలు, మగబిడ్డ జన్మిస్తే రూ. 12 వేలు పారితోషికంతో పాటు తల్లీబిడ్డల సంరక్షణ కోసం కెసిఆర్ కిట్‌ను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సర్కార్ దవాఖానల్లో కార్పోరేట్‌కు దీటుగా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నదని, గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సు నసీమా, ఏఎన్‌ఎం బుబా, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

Related Articles

- Advertisement -

Latest Articles