పంజాబ్‌లోని సనౌర్ నియోజకవర్గం ఆప్ ఎమ్మెల్యే (AAP MLA) హర్మిత్ సింగ్ పఠాన్‌మజ్రాను పోలీసులు అత్యాచారం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. హర్మిత్ సింగ్‌పై తన మాజీ భార్య అత్యాచారణ ఆరోపణలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఎమ్మెల్యేపై కేసు నమోదు కాగా.. మంగళవారం హర్యానాలోని కర్నాల్‌లో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్, జలవనరుల ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్‌పై హర్మిత్ సింగ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిపై ఆయన వాళ్లపై మండిపడ్డాడు. ఇది జరిగిన తర్వాతే హర్మిత్‌ను అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సోమవారం రాత్రి 10.17 గంటలకు ఎమ్మెల్యే (AAP MLA) మాజీ భార్య పటియాలాలోని సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె పేర్కొన్న వివరాల ప్రకారం.. 2014, ఫిబ్రవరి 12 నుంచి 2024 జూన్ 12 వరకూ ఈ నేరం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై ఐపిషి సెక్షన్ 376, 420, 506 కింద అత్యాచారం, మోసం, క్రిమినల్ బెదిరింపుల అభియోగాల కేసు నమోదు చేశారు.
Also Read : టిఎంసి ఎంపి మహువా మొయిత్రాపై కేసు నమోదు