Friday, April 26, 2024

సుప్రీంకోర్టులో స్వలింగ వివాహాలను వ్యతిరేకించిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన వ్యతిరేకతను తెలిపింది. అది సమాజం ఆమోదించిన విలువలను కాలరాస్తుందని వాదించింది. స్వలింగ మనుషులు సంపర్కం పెట్టుకోవడం, కలిసి జీవించడం ఇప్పుడు నేరం కాదు. అది భారతీయ కుటుంబ జీవితానికి అనుగుణంగా ఉండదు. కుటుంబం అంటే భార్యభర్త, వారి పిల్లలు. స్వలింగ జంట వివాహం చేసుకోవడం అన్నది భారతీయ విలువలు, నైతికతకు అనుగుణమైనవి కావని కేంద్రం వాదించింది.

స్వలింగ దంపతులు వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడాన్ని ఆమోదిస్తూ ఆదేశివ్వాలని కోరుతూ అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకంగా తన ప్రతిస్పందనను కోర్టుకు తెలిపింది. ఒకే లింగానికి చెందిన వ్యక్తులను మహిళ, పురుషుడు అని గుర్తించడం జరుగదని స్పష్టం చేసింది. వారిని భర్త, భార్య గుర్తించబోమంది. స్వలింగ వివాహాన్ని ఆమోదిస్తూ చట్టం చేయలేమని పేర్కొంది.

పెళ్లి అనేది హిందూ ఆచారంలో ఓ పవిత్ర క్రతువు. ముస్లింల ఆచారం ప్రకారం అదో ఒప్పందం(కాంట్రాక్ట్). స్వలింగ వివాహాన్ని గుర్తించమని పిటిషనరు కోరడానికి లేదు. స్వలింగ జంట కలిసి జీవించడాన్ని ఐపిసి సెక్షన్ 377 ప్రకారం నేరంగా గుర్తించకపోయినప్పటికీ వారి వివాహానికి చట్టబద్ధత లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News