Saturday, May 3, 2025

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెడ్ అలెర్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశముందని అనుమానం రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సెక్యూరిటీ ఆధికారులు తెలిపారు. అందులో భాగంగా జనవరి 31 వరకు సందర్శకులకు అనుమతి ఉండదని పోలీసులు స్పష్టం చేశారు.

ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలలో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయడంతో పాటు ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్, డాంగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఎయిర్ పోర్ట్‌కు వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వాహనాలను సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులు ఆపి తనిఖీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News