Sunday, April 28, 2024

తెలంగాణ శాసనసభపై ‘ రెడ్డి ’ ముద్ర !

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డు
ప్రధాన పార్టీల నుంచి 43 మంది విజయం
2018 సభలో కంటే ఐదుగురు అధికం
కాంగ్రెస్‌కు 26,  బిఆర్‌ఎస్‌కు 14 , బిజెపికి 3చోట్ల ప్రాతినిధ్యం

మనతెలగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభపై‘ రెడ్డి’ మార్కు ముద్ర పడింది.రాష్ట్ర రాజకీయరంగం చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణకు 119 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో 28 రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉండగా అందులో 17 నియోజకవర్గాలు షెడ్యూల్ తెగలకు ,11 షెడ్యూల్ కులాలకు చెందిన వారికి రిజర్వ్ చేయగా, మిగిలిన 91 నియోజకవర్గాలు జనరల్ కేటగిరిలో ఉన్నాయి. ఇందులో అత్యధికశాతం నియోజకవర్గాలకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్దులే పోటీ చేశారు. ఈ సారి భారాత రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ , కాంగ్రెస్ తదితర ప్రధాన పార్టీల నుంచి 114 మంది రెడ్డి సామాజిక వర్గం అభ్యర్దులు పోటీ చేశారు. అందులో బిఆర్‌ఎస్ నుంచి 44మంది , కాంగ్రెస్ నుంచి 42మంది, బిజేపి నుంచి 28 మంది రెడ్డి సామాజిక వర్గం అభ్యర్ధులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రెడ్డి అభ్యర్ధులు మూడు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 43మంది రెడ్డి సామాజిక వర్గం వారు విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభకు ప్రాతినిధ్యం పొందారు. ఇందులో పార్టీల వారీగా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన 42 మందిలో 26 మందిని విజయలక్ష్మి వరించింది. బారతరాష్ట్ర సమితి పార్టీ నుంచి 44 మంది పోటీ చేయగా అందులో 14మంది రెడ్డి అభ్యర్ధులు విజయాన్ని దక్కించుకున్నారు. భారతీయ జనతాపార్టీ నుంచి మొత్తం 28మంది రెడ్డి అభ్యర్దులు పోటీ చేయగా అందులో ముగ్గురు అభ్యర్ధులు విజయం సాధించారు. ఈ సారి అసెంబ్లీకి ఈ మూడు ప్రధాన పార్టీ నుంచి మొత్తం 43మంది ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం పొందారు.

దక్షిణ తెలంగాణ నుంచే 25 మంది విజయం :
రాష్ట్రంలోని ఉత్తర , మధ్య , దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో అత్యధికంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని నియోజకవర్గాల నుంచే అత్యధికంగా 25 రెడ్డి సామాజిక వర్గం సభ్యులు అసెబ్లీకి ప్రాతినిధ్యం పొందారు. అందులో ఉమ్మడి జిల్లాల వారీగా మహబూబ్ నగర్: జిల్లా నుంచి తొమ్మది మంది విజయం సాధించగా , అందులో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి గద్వాలలో కృష్ణమోహన్‌రెడ్డి విజయం దక్కించుకుని ఈ జిల్లానుంచి ఆ పార్టీకి ఏకైక రెడ్డి ఎమ్మెల్యేగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది విజయం సొంతం చేసుకున్నారు. జడ్చర్ల నుంచి అనురుధ్ రెడ్డి, నారాయణపేట్ నుంచి పర్ణికారెడ్డి, దేవరఖద్ర నుంచి మధుసూధన్‌రెడ్డి, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి కె.రాజేష్ రెడ్డి, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, వనపర్తి నుంచి తుడి మేఘారెడ్డి , మహబూబ్ నగర్‌నుంచి ఎన్నెం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు.

నల్లగొండ: జిల్లానుంచి 8 మంది రెడ్డి అభ్యర్ధులు విజయం దక్కించుకున్నారు. ఇందులో సూర్యాపేట నుంచి జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పార్టీ నుంచి గెలుపొంది ఈ జిల్లాలో ఆ పార్టీకి ఏకైక రెడ్డి ఎమ్మెల్యేగా నిలిచారు .కాంగ్రెస్ పార్టీలో హూజుర్‌నగర్‌నుంచిఉత్తం కుమార్‌రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి రెడ్డి, భువనగిరి నుంచి అనిల్‌కుమర్ రెడ్డి, నాగార్జునసాగర్ నుంచి జైవీర్ రెడ్డి, మునుగోడు నుంచి రాజగోపాల్‌రెడ్డి, నల్లగొండ నుంచి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మా రెడ్డి ఎమ్మేల్యేలుగా శాసనసభకు ప్రాతినిధ్యం దక్కించుకున్నారు.

రంగారెడ్డి:జిల్లాలో మొత్తం 8మంది రెడ్డి అభ్యర్దులు విజయం సాధించారు. ఈ జిల్లాలో బిఆర్‌ఎస్‌పార్టీ నుంచి మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, మేడ్చెల్ లో మల్లారెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్‌లో బండారు లకా్ష్మరెడ్డి, లాల్‌బహూదూర్ శాస్త్రీనగర్ (ఎల్‌బినగర్)నుంచి డి.సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్‌పార్టీ నుంచి పరిగిలో రామ్మోహన్‌రెడ్డి, ఇబ్రహింపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, తాండూరులో మనోహర్‌రెడ్డి విజయం దక్కించుకున్నారు.

ఉత్తరతెలంగాణలో ఎనిమిది మంది విజయం :
ఉత్తరతెలగాణ ప్రాంతంలో ప్రధాన పార్టీ నుంచి ఎనిమిది మంది రెడ్డి సామాజిక వర్గం అభ్యర్దులు విజయం సాధించారు. అదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నుంచి బిజేపిపార్టీ నుంచి మహేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. నిజామాబాద్ జిల్లాలో బిఆర్‌స్ పార్టీ నుంచి బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి, బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బోధన్‌లో పి.సుదర్శన్‌రెడ్డి , నిజామాబాద్ రూరల్‌లో భూపతి రెడ్డి విజయం దక్కించుకున్నారు. ఈ జిల్లాలో భారతీయ జనతాపార్టీనుంచి కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి, ఆర్మూర్‌లో పైడి రాకేశ్‌రెడ్డి విజయం సాధించారు. కరీంనగర్ జిల్లాలో బిఆర్‌ఎస్‌పార్టీ నుంచి పాడి కౌశిక్‌రెడ్డి హూజూరాబాద్‌లో విజయం సాధించారు.

సెంట్రల్ తెలంగాణలో 10 నియోజకవర్గాలు రెడ్లవే!
సెంట్రల్ తెలంగాణ ప్రాంతలో ప్రధానరాజకీయపార్టీలనుంచి పది నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గం వారు విజయం సాధించారు. వరంగల్ జల్లాలో బిఆర్‌ఎస్‌పార్టీ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామలో ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పాలకుర్తిలో యశస్విని రెడ్డి, వరంగల్ వెస్ట్ నుంచి నాయుని రాజేందర్‌రెడ్డి, నర్శంపేటనుంచి దొంతి మాధవరెడ్డి , పరకాల నుంచి రేవూరి ప్రకాష్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం సాధించారు. ఖమ్మం జిల్లాలో పాలేరు నుంచికాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిధ్యం దక్కించుకున్నారు. మెదక్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా నారాయణఖేడ్ నుంచి విజయం సాధించి సంజీవరెడ్డి అసెంబ్లీకి ప్రాతినిధ్యం పొందారు. ఈ జిల్లాలో బిఆర్‌ఎస్‌పార్టీ నుంచి దుబ్బాకలో కొత్తప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరులో గూడెం మహిపాల్‌రెడ్డి, నర్సాపూర్‌లో సునీతాలకా్ష్మరెడ్డి విజయం సాధించి అసెంబ్లీకి ప్రాతినిధ్యం పొందారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News