Thursday, May 2, 2024

తెరిపిచ్చిన వర్షాలు.. తేలిక పడ్డ వాతావరణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రమంతటా గత వారం రోజులుగా ముసురు పట్టి కురుస్తూ వచ్చిన వర్షాలు కాస్త తెరిపినిచ్చాయి. ఆకాశంలో నీలిమేఘాలు తొలిగిపోయి నిర్మలంగా మారింది.. శనివారం సూర్యుడు తొలంగాణపైకి తొంగి చూశాడు. ఎండపొడ తగలటంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉన్న షియర్ జోన్ బలహీనపడింది.దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ దిశనుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది.

రానున్న 24గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలిక పాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రానికి ఎటువంటి ప్రత్యేక వర్షసూచనలు, వాతావరణ హెచ్చరికలు ఉండవని పేర్కొంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా భైంసాలో 30 మి.మి వర్షం కురిసింది. పార్వతిపురంలో 19.6, అశ్వారావుపేటలో 17.6, హైదరాబాద్ షేక్‌పేటలో 16, జాఫర్‌గఢ్‌లో 13.8, సిద్దిపేటలో 13.5, చెన్నరావు పేటలో 12.6, సత్తుపల్లిలో 10.4, సంగెంలో 7.2, జూలూరుపాడులో 6.8 మి.మి చోప్పున వర్షం కురిసింది.రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలిక పాటి జల్లులు పడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News