Thursday, May 2, 2024

నిరంతర వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన జీవనం: వైద్యులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: కార్డియో వ్యాస్కులర్ వ్యాధులు నేడు ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలు బలికొంటున్న వ్యాధులలో ఒకటిగా ప్రఖ్యాతి గడిస్తోందని విరించి ఆసుపత్రి సీఈవో డా. సాయి రవి శంకర్ పేర్కొన్నారు. సుమారు 17 మిలియన్ ప్రజలు ఈ వ్యాధుల కారణంగా చనిపోతున్నారని లెక్కలు చెబుతున్నాయన్నారు. ఈ మరణాలలో ఎక్కువ శాతం పేద దేశాలలోనే జరుగుతున్నాయనేది ఒక అపోహ మాత్రమేనని, ఎక్కువ శాతం మరణాలు అభివృద్ది చెందిన, వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాలలో జరుగుతున్నాయని వివరించారు. రక్తపోటు, డయాబెటీస్ లాంటి జీవన శైలి వ్యాధులు అదుపులో లేక గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. వీటితో పాటూ నిరంతరం వ్యాయామం, మంచి ఆరోగ్య అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవన శైలి వంటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వరల్ హార్ట్ డే పురస్కరించుకొని ఆసుపత్రిలో చికిత్స పొందిన వారితో పాటూ ప్రస్తుసతం చికిత్స అందుకొంటున్న రోగులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

అనంతరం ఆసుపత్రి వైస్ చైర్మన్ వేదుల సత్యనారాయణ ప్రసంగిస్తూ హార్ట్ ఎటాక్ కు సంబంధించి మన శరీరం ఇచ్చే సంకేతాలను సరైన సమయంలో గుర్తించి వెంటనే నిపుణులైన వైద్యులున్న హాస్పిటల్ కు రాగలగితే ప్రాణాన్ని కాపాడవచ్చని చెప్పారు. అయితే ఈ సంకేతాలపై ప్రజలలో అవగాహన లేదని, దానిని కలిపించడానికే విరించి హాస్పిటల్స్ పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో డా. సుధీర్,- డా. వివేక్, డా. యామిని, డా. యం ఆర్ సి నాయుడు, అపర్ణ నెమలికంటి, జోసెఫ్, మమత, శ్రీనివాస్, మనీష, సబితా, కాత్ ల్యాబ్ టెక్నిషియన్స్, విరించి హాస్పిటల్స్ తో పాటూ కార్డియాలజీ విభాగపు నర్సింగ్ సిబ్బంది లీలా, డానియల్, రాబర్ట్, వంశీ, మేఘన, సౌమ్యతో పాటు రోగులు, వారి సహాయకులు, బంధువులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News