Wednesday, April 24, 2024

అడిగా అడిగా…

- Advertisement -
- Advertisement -

Release of Akhanda first single Adiga Adiga

సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా శనివారం అఖండ ఫస్ట్ సింగిల్ ‘అడిగా అడిగా…’ను రిలీజ్ చేశారు. ఈ పాట బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ కు ఒకరిపట్ల ఇంకొకరి ఎంత ప్రేమ ఉందో చూపించేలా సాగింది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న తమన్ ఈ మెలోడి గీతం కోసం ఒక అద్భుతమైన ట్యూన్‌ను అందించారు. ఎస్పీ చరణ్, ఎంఎల్ శ్రుతి ఈ పాటను శ్రావ్యంగా పాడారు. కళ్యాణ్ చక్రవర్తి మంచి సాహిత్యాన్ని అందించారు. ఈ పాట సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News