Saturday, December 9, 2023

నందిగామలో ఇల్లు ఖాళీ చేయించిందనే కోపం.. ఓనర్ హత్య

- Advertisement -
- Advertisement -

షాద్ నగర్: కిరాయి వాళ్లను యజమాని ఇల్లు ఖాళీ చేయించినందుకు పగ పెంచుకుని ఓనర్ ను దారుణంగా హత్య చేసిన సంఘటన షాద్ నగర్ లో చోటుచేసుకుంది. వృద్ధురాలు, బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బిహార్ కు చెందిన భార్యాభర్తలు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నెల రోజుల క్రితం వృద్ధురాలు పార్వతమ్మ ఇంట్లో బిహార్ దంపతులు అద్దెకు దిగారు. పార్వతమ్మతో పలుమార్లు గొడవ పడ్డారు. దీంతో విసిగిపోయిన పార్వతమ్మ బిహార్ దంపతులను ఇల్లు ఖాళీ చేయించింది.

దీంతో వారు నందిగామలోనే మరో ఇంట్లో అద్దెకు దిగారు. బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారని పగ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే పార్వతమ్మ, ఆమె మనవరాలిని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. హత్య చేశాక బీరువాలోని డబ్బు, బంగారం ఎత్తుకెళ్లారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News