Saturday, July 27, 2024

కింకర్తవ్యం?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ లో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది.ఈ పథకంలో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది కుంగిపోయి న నేపథ్యంలో ఈ బ్యారిజికి రిపేర్లు చేసి తిరిగి దా రిలో పెట్టగలమా లేక ప్రత్యామ్నాయ మార్గాలు అ న్వేషించాల అన్నదానిపై త్వరలోనే నిర్ణయం వెల్లడించనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపా రు. మేడిగడ్డ ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి.. ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చ ర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. శనివారం సా యంత్రం సచివాలయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన స మీ క్ష జరిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరా వు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సిఎం సలహాదారు వేంనరేందర్ రె డ్డి సమావేశంలో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవటంతో, తాత్కాలికంగా చేపట్టాల్సిన మ రమ్మతులు, పునురుద్ధరణ చర్యలపై ఇటీవల ఎన్డీఎస్‌ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇ చ్చింది.

ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశా లు, సిఫారసులన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీ ఎంతో పాటు మంత్రులకు వివరించారు. 2019 లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రి పేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని తోసిపుచ్చలేమని ఎన్డీఎస్‌ఏ అం దులో స్పష్టం చేసింది. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గ సమావేశంలో చ ర్చించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. రిపేర్లు చే యాలా.. ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా.. మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. శనివారం నాటి కేబినేట్ భేటీ జరుగకపోవటంతో ఈ కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News