Thursday, March 23, 2023

బాన్సువాడ డివిజన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -

వాడ వాడలా రెపరెప లాడిన మువ్వన్నెల జెండా……

బాన్సువాడ: బాన్సువాడ డివిజన్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, కూడళ్లు, చౌరస్తాలు, ఆయా పార్టీల కార్యాలయాలు, ఆటో స్టాండ్‌లు తదితర చోట్ల జాతీయ జెండాను ఎగురవేశారు. బాన్సువాడ ఆర్డీవో కార్యాలయం వద్ద బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, గాంధీ చౌక్‌లో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ గంగాధర్, మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ నేర్రె నర్సింలు, ఆయా చోట్ల ఆయా శాఖల అధికారులు, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు, కూడళ్లు, చౌరస్తాలు, తదితర చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు.

గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆటల పోటీలు నిర్వహించగా, గెలుపొందిన విజేతలకు గణతంత్ర దినోత్సవం రోజున బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, ఎర్వల కృష్ణారెడ్డి, దొడ్ల వెంకట్రాం రెడ్డి, పిట్ల శ్రీధర్, మహ్మద్ ఎజాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, మున్సిపల్ కమీషనర్ రమేష్, కౌన్సిలర్లు లింగమేశ్వర్, బాడీ శ్రీనివాస్, వెంకటేశ్, కిరణ్, హకీం, రఫి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News