Saturday, September 30, 2023

 మైత్రి అంబుజా యాజమాన్యంకు నోటీసులు జారీ చేసిన రెరా అధికారులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  మైత్రి అంబుజా (సంఘీ అంబుజా) ప్రాజెక్ట్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా, రెరా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కోహెడ గ్రామం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లాలో   ప్రీలాంచ్ ప్రాజెక్టు చేపట్టడంపై రెరా అధికారులు వెంటనే స్పందించారు. ఆ సంస్థ యాజమాన్యానికి రెరా కార్యదర్శి ఎస్. బాలకృష్ణ నోటీసులు జారీ చేశారు. సంజాయిషీ వచ్చిన తరువాత విచారణ జరిపి రెరా చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ రెరా రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా, ఫ్రీలాంచ్ ప్రాజెక్టులు చేపట్టి ప్రజలను మోసం చేసినా కఠినచర్యలు తీసుకుంటామని బాలకృష్ణ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News