మన తెలంగాణ/ జనగామ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాకు తొమ్మిది లక్షలతో మంజూరు చేసిన ఎన్‌డీఆర్‌ఎఫ్ రెస్కూబోట్‌ను జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గురువారం కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. విపత్కర, వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో రెస్కూ బృందాలు చేసే సాహసం చాలా గొప్పదన్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు వారి ప్రాణాలను సైతం పణంగా పెడుతారని కొనియాడారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, జిల్లా ఫైర్ ఆఫీసర్ బి.రేమండ్‌బాబు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి.సాయికుమార్, లీడింగ్ ఫైర్‌మన్ ఇ.ప్రభాకర్, డ్రైవర్స్ ఎస్‌కే.రఫీ, జె.కోటేశ్వరబాబు, ఫైర్‌మెన్ బి.కరుణాకర్, ఎం.కనకమల్లేశం, ఎల్.ఐలయ్య, బి.బాలకృష్ణ పాల్గొన్నారు.