Tuesday, December 10, 2024

కాస్కో.. కెసిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ మొక్కను మళ్లీ తెలంగాణ గడ్డపై మొలవనివ్వను

ఒక్కసారి ఓడిస్తే మళ్లీ ప్రజల ముఖం చూడవా? రాహుల్‌ను చూసి కెసిఆర్ బుద్ధి తెచ్చుకోవాలి మూడుసార్లు
ప్రతిపక్షంలోనే ఉన్నా.. ఆయన ప్రజల మధ్యే ఉన్నారు అధికారం ఇస్తే దోచుకుంటా.. లేదంటే ఫామ్‌హౌస్‌లో
దాచుకుంటానంటే ఎలా? నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే జనంలోకి వచ్చి మాట్లాడాలి అసెంబ్లీకి వచ్చి సూచనలు
ఎందుకు చేయడం లేదు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపు రుణమాఫీ చేశాం వరంగల్ గడ్డ హామీ
ఇస్తున్నా.. రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదు
సమస్యలు పరిష్కరించి అందరికీ మాఫీ జరిగేలా చూస్తాం కేంద్ర మంతి కిషన్ రెడ్డి మోడీకి గులామ్ మహిళలను
కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం హన్మకొండప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ‘అసెంబ్లీకి రా…చర్చ పెడదాం. తారీఖు నిర్ణయించు, ఏ రోజు కావాలో, ఏ సమయం కావాలో చెప్పు.. నీ దుఃఖం ఏంటో, బాధ ఏంటో చెప్పుకో.. అంతేగానీ చిల్లరగాళ్ళను ఎగదోస్తావా? నీ సంగతి నాకు బాగా తెలుసు..కాస్కో, నీ మొక్కను మొలకెత్తనివ్వ ను’ అంటూ మాజీ సిఎం కెసిఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హన్మకొండలోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌం డ్‌లో మంగళవారం నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే ఫాంహౌస్‌లో గాడి ద పళ్లు తోముతున్నావా అని కెసిఆర్‌ను ప్రశ్నించా రు.

ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని, సహేతుకమైన సూచనలు చేస్తే సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు. మూడుసార్లు ప్రతిపక్షంలో ఉండి కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసిన తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకోవాలని అన్నారు. అధికారంలో ఉంటే దోచుకోవడం, ప్రతిపక్షంలో ఉంటే ఫాం హౌస్‌లో దాచుకోవడం అనేదే కెసిఆర్ నైజం అని అన్నారు. ‘కెసిఆర్ సంగ తి తనకు బాగా తెలుసునని, ఆయన ఆరాటం, ఉ బలాటం అన్నీ తనకు తెలుసన్నారు. పది నెలల్లో ఏం కోల్పోయామో ప్రజలకు అర్థమైందని అంటున్న కెసిఆర్…ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలన్నారు. పది నెలల్లో వాళ్ల ఇంట్లో నలుగురికి పదవులుపోతే.. రాష్ట్రంలో 50 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని, కొన్ని కారణాల వల్ల మాఫీకి ఆటంకం ఏర్పడిందని తెలిపారు. బ్యాంకుల్లో సవరణలు చేసుకోవాలని, అందరికీ రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. పదేళ్లలో లక్ష రుణమాఫీ చేస్తామని ముఖం చాటేశారని దుయ్యబట్టారు. బిర్లా, రంగా కట్టెలు పట్టుకుని కాళ్లలో పెట్టడానికి తిరుగుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి చేసేవాళ్లను అడ్డుకుంటే భవిషత్‌లో డిపాజిట్లు దక్కవని హెచ్చరించారు.

కుట్రలు, కుతంత్రాలు చేస్తే ఊచలు లెక్కబెట్టిస్తానని హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ప్రతినెలా రూ.18 వేల 500 కోట్ల ఆదాయం వస్తోందని, దీనిలో గత ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు రూ.6500 కోట్లు, రూ.6500 కోట్లు జీతాలు, పెన్షన్లకు పోగా మిగతా రూ.5500 కోట్లను పొదుపుగా చేసి పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనివిధంగా ఈసారి రాష్ట్రంలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని చెప్పారు. రాష్ట్రంలో కెసిఆర్ తాగుబోతుల సంఘం అధ్యక్షుడి గా ఉన్నారని, వాటికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని సిఎం రేవంత్ రెడ్డి ఎత్తిపొడిచారు.

ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులామ్ అని సిఎం ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేసిన మోడీకి ఆయన ఊడిగం చేస్తున్నారని, ఆయన గుజరా త్‌కు వెళ్లి ఉండాలన్నారు. తాను సోనియాకు రుణపడి ఉంటానని చెప్పారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, 1200 మంది బలిదానాలకు చలించి ఆంధ్రాలో పార్టీ పోతున్నా తెలంగాణ కల సాకారం చేసిన అమ్మ సోనియ అన్నారు. తాను సోనియా కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటానని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా తన పాపాలను పోగొట్టుకోవడానికి ఆ నీళ్లు చల్లుకోవడానికి రావాలన్నారు. కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం పోయిందని, ఇప్పటికైనా గుజరాత్ గులామ్‌గా కాకుండా సికింద్రాబాద్ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు.

మహిళలను కోటేశ్వరులను చేస్తాం

రాష్ట్రంలో మహిళలను కోటేశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత మహిళలకు స్వేచ్ఛ వచ్చిందని అన్నారు. ఈ ఏడాదిలో రూ.34 వేల కోట్లు సహకారం అందిస్తామని చెప్పారు. అదానీ, అంబానీల చేతుల్లో ఉన్న పవర్‌ను మహిళలకు అప్పగించనున్నామని తెలిపారు. సోలార్ పవర్‌ను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. బస్సుల కొనుగోలు కూడా సంఘాలు చేస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్నేళ్లవరకు మహిళా మంత్రులకు ప్రాతినిధ్యం లేదని, కానీ తాము వారికి పెద్దపీట వేశామని అన్నారు. ఇందులో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన కొండా సురేఖ, సీతక్కలకు మంత్రిమండలిలో ప్రాతినిధ్యం కల్పించి, మహిళల పట్ల తమకున్న గొప్పతనాన్ని చాటుకున్నామని అన్నారు.

కాళోజీ, జయశంకర్‌ను నిర్లక్ష్యం చేశారు

ప్రజాకవి కాళోజీ నారాయణరావు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సిఎంం మండిపడ్డారు. పదేళ్లుగా కాళోజీ కళా క్షేత్రాన్ని పూర్తిచేయకపోవడమే అర్థమవుతున్నదన్నారు. స్థానిక ఎంఎల్‌ఎ నాయిని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి ఒకేసారి రూ.45 కోట్లు తెచ్చి పూర్తి చేయించారని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ పుట్టిన అక్కంపేట గ్రామాన్ని విస్మరిస్తే.. తమ ప్రజా పాలనలో రెవెన్యూ గ్రామంగా ప్రకటించామని గుర్తుచేశారు. తమ పార్టీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలు గమనించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News