Friday, March 1, 2024

మీ కష్టం, మీ శ్రమ వృథా కాదు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని ప్రశంసించారు. మీ కష్టం, మీ శ్రమ వృథా కాదని, తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిదని, ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News