Sunday, January 26, 2025

గృహజ్యోతి స్కీమ్ పై  సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పేదల ఇంట విద్యుత్తు వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలనిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన  రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకంపై సోమవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రసుగా ఇందిరమ్మ పాలన నిలుస్తోందని పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 10.52 లక్షల కుటుంబాలు గృహజ్యోతి పథకం కింద ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఈ పరిణామం హర్షణీయమని పేర్కొన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించే గృహాలకు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తును ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిన విషయమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News