- Advertisement -
అమరావతి: అల్లూరి, మన్యం జిల్లా కొండచర్యల సమస్యలపై ఐటిడిఎ పివోలను అప్రమత్తం చేశామని ఎపి మంత్రి సంధ్యారాణి (Sandhya Rani) తెలిపారు. వర్షాలు ఎక్కువగా ఉంటే పాఠశాలలకు సెలవులు పొడిగిస్తామని అన్నారు. అల్లూరి, మన్యం జిల్లాల్లో కలెక్టర్లకు ఆదేశాలిచ్చి చర్యలు తీసుకున్నామని, ఉత్తరాంధ్ర భారీ వర్షాలపై ప్రభుత్వం సమీక్షిస్తోందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..శాఖాపరంగా తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో (tribal areas) డోలీ మోతలు ఏడాది కాలంలో తగ్గించామని, దాదాపు రూ. 1,300 కోట్లు రహదారుల అభివృద్ధికే చేపట్టామని అన్నారు. 3 ఏళ్లలో గిరిజన ప్రాంతాల్లో మెజారిటీ రహదారులను అభివృద్ధి చేస్తామని సంధ్యారాణి పేర్కొన్నారు.
- Advertisement -