Thursday, May 1, 2025

ఆగ్రాలో పెళ్లికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -
Road accident while going to a wedding in Agra
ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు

ఆగ్రా(యూపి): పెళ్లివారి వ్యాను, బస్సును ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, మరి ఐదుగురు గాయపడ్డారు. వారు వెళుతున్న పెళ్లి ప్రదేశానికి కేవల కొన్ని కిమీ. దూరంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని బుధవారం పోలీసులు తెలిపారు. తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేహాబాద్‌లో మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌ఓ) భూపేంద్ర సింగ్ తెలిపారు. “చనిపోయినవారిని ఫారూఖ్, సోబీ, గౌరవ్‌గా గుర్తించాము. ఫారూఖ్, సోబీ అక్కడికక్కడే చనిపోగా, గౌరవ్ అనే వ్యక్తి మాత్రం సరోజిని నాయుడు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో బుధవారం చనిపోయాడు” అని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సు జైపూర్‌లోని దియోరియాకు వెళుతుండగా ప్రమాదానికి గురయిందని కూడా ఆయన తెలిపారు. కాగా బస్సులో ప్రయాణించిన వారిలో ఎవరూ గాయపడలేదని ప్రత్యక్షసాక్షి తెలిపారు. కాగా ఆ బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో జైపూర్‌కు పంపించారని , కాగా వ్యానులో ప్రయాణించి గాయపడిన వారిని అంబులెన్స్ వచ్చేలోగా స్థానికులు, పోలీసులు ఆటో రిక్షాలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని కూడా అతడు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News