Sunday, May 19, 2024

యూనిఫారం ఉన్న చోట దాన్ని పాటించాల్సిందే!

- Advertisement -
- Advertisement -
If uniform is prescribed it must be followed
కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశం

న్యూఢిల్లీ: మతపరమైన దుస్తులు వేసుకోరాదన్న తాత్కాలిక ఆదేశం కేవలం కొందరు విద్యార్థులకే కాక విద్యార్థులందరికీ వర్తిస్తుందని కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్థీ తెలిపారు. ఎక్కడైతే యూనిఫారం నిర్దేశించారో అక్కడ దానిని తుచ తప్పక పాటించాల్సిందేనని ఆయన అన్నారు. హిజాబ్ కేసులో ప్రభుత్వం, ప్రతివాదుల వాదనలు వింటున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. శిరోవస్త్రాన్ని కూడా బలవంతంగా తొలగింపజేస్తున్నారంటూ టీచర్ల తరఫున మరో అడ్వొకేట్ సమర్పించిన వినతిపై న్యాయమూర్తి అవస్థీ ప్రతిస్పందిస్తూ ‘కోర్టు ఉత్తర్వు కేవలం విద్యార్థులకు మాత్రమే పరిమితమైంది’ అని స్పష్టం చేశారు.

‘కోర్టు ఉత్తర్వు చాలా స్పష్టంగా ఒకవేళ యూనిఫారం ఉంటే విద్యార్థులంతా దానిని పాటించాల్సిందేనని తెలిపింది. అది డిగ్రీ కాలేజ్ విద్యార్థులైనా సరే లేక ప్రీయూనివర్శిటీ విద్యార్థులైనా సరే యూనిఫారం అనేది ఉంటే పాటించాల్సిందే”అని పేర్కొన్నారు. ఇదిలావుండగా ప్రీయూనివర్శిటీ కాలేజీల్లోని ఓ కాలేజి తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ ఎస్‌ఎస్ నాగానంద ‘హిజాబ్ వివాదంను క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(సిఎఫ్‌ఐ) ప్రారంభించిందని, దాని సభ్యులు విద్యార్థులను, అధికారులను కలిసి విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులలోకి వచ్చేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News