Tuesday, June 18, 2024

ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం :ఈసీ

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకోడానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.8,889 కోట్ల మేర విలువైన నగదు, మాదక ద్రవ్యాలు , ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. జప్తు చేసిన సొత్తులో మాదక ద్రవ్యాలదే 45 శాతం వాటా అని, రూ. 3958 కోట్ల మేర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. స్వాధీనమైన సొత్తులో నగదు రూపేణా రూ.849.15 కోట్లు, మద్యం (రూ.814. 85 కోట్లు ), మాదక ద్రవ్యాలు (రూ.3958 కోట్లు) ,

బంగారం, వెండి వంటి ఆభరణాలు (రూ. 1260.33 కోట్లు ), ఇతర ఉచితాలు (రూ. 2006.59 కోట్లు ) ఉన్నట్టు ఈసీ తెలియజేసింది. అత్యధికంగా గుజరాత్‌లో రూ. 1461.73 కోట్ల విలువైన ప్రలోభాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తన నివేదికలో వెల్లడైంది. రాజస్థాన్ (రూ. 1133.82 కోట్లు), పంజాబ్ (రూ.734.54 కోట్లు), రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో రూ301. 75 కోట్లు , తెలంగాణలో రూ. 333.55 కోట్లు సొత్తు జప్తు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News