Wednesday, July 24, 2024

ఎపి ఉద్యోగులపై నిర్ణయం తీసుకోలేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ, ఎపి ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొత్త నిర్ణయాలు ఏమీ తీసుకోలేదని, రా ష్ట్రం ఏర్పడిన ఏడాది రెండేళ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చింద ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తెలంగాణకు ఎపి ఉద్యోగులు రావడానికి దరఖాస్తు పెట్టుకున్నారని ఉద్యోగులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీని పై క్లారిటీ ఇచ్చింది. ఎపి నుంచి ఉద్యోగులు తెలంగాణకు వస్తున్నట్లు జరుగుతున్న తప్పు డు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఉ ద్యోగుల విభజన సమయంలో ఆప్షన్లు, పోస్టు ల లభ్యత ఆధారంగా తెలంగాణ స్థానికత ఉ న్న ఉద్యోగులు కొందరు ఎపికి, ఎపి స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు తెలంగాణకు బది లీ అయ్యారని తెలిపింది. వైద్య అవసరాలు, భార్యభర్తలు ఉద్యోగాల్లో ఉండటం, పిల్లల చ దువులు, సొంత ఇల్లు ఉన్నాయన్న కారణాల తో కొందరు ఉద్యోగులు ఈ పంపిణీ జరిగిన తీరుతో ఇబ్బందులు  పడ్డారని, మానవీయ కోణంలో తమ బాధను అర్థం చేసుకోవాలని పలుమార్లు ప్రభుత్వాన్ని వారు అభ్యర్థించారని ప్రభుత్వం పేర్కొంది.

ఎపి నుంచి తెలంగాణకు రావడానికి 1,808 మంది ఆప్షన్‌లు…
అదే సమయంలో ఎపికి వెళ్లేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ తెలంగాణకు పంపిణీ అయిన 1,369 మంది ఉద్యోగులు తమతంట తాముగా సమ్మతి తెలిపారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 1,369 మంది శాశ్వతంగా ఎపికి వెళ్లేందుకు సమ్మతిస్తూ తమను ఎపికి పంపించాలని అప్పటి ప్రభుత్వానికి అభ్యర్థనను అందించారని తెలిపింది. 2021 సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆ ఉద్యోగుల వివరాలను సేకరించి వారి అభ్యర్థన మేరకు ఆయా ఉద్యోగులను ఎపికి పంపించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని నో అబ్జక్షన్ తెలియజేస్తూ 2021 సెప్టెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇదే తరహాలో ఎపి ప్రభుత్వం కూడా అక్కడి నుంచి తెలంగాణకు వచ్చేందుకు సిద్ధపడిన ఉద్యోగుల వివరాలను సేకరించిందని, అక్కడి నుంచి 1,808 మంది ఉద్యోగులు తెలంగాణకు రావడానికి ఆప్షన్లు ఇచ్చారని, శాశ్వతంగా తెలంగాణకు వెళ్లేందుకు సమ్మతి తెలిపే ఉద్యోగుల జాబితాను తయారు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

2022 సెప్టెంబర్‌లో తెలంగాణకు లేఖ రాసిన ఎపి సిఎస్
2022 సెప్టెంబర్ 23వ తేదీన అప్పటి ఎపి సిఎస్ సమీర్ శర్మ అప్పటి తెలంగాణ సిఎస్‌గా ఉన్న సోమేష్ కుమార్‌కు ఇదే విషయంపై లేఖ రాశారని, ఉద్యోగుల అభ్యర్థనలను మానవీయ కోణంలో పరిశీలించాలని కోరారని ప్రభుత్వం తెలిపింది. రెండు రాష్ట్రాల్లో అప్పటికే ఆఫ్షన్లు ఇచ్చిన ఉద్యోగుల పరస్పర బదిలీకి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని ఎపి సిఎస్ కోరారన్నారు. ఈ ఉద్యోగుల బదిలీ వ్యవహారం ఎనిమిదేండ్లుగా నానుతోందని, విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య సమావేశాలు జరిగినప్పుడల్లా ఈ అంశంపై పలుమార్లు చర్చలు జరిగాయని, కానీ, ఇప్పటివరకు ఉద్యోగుల పరస్పర బదిలీకి సంబంధించి రెండు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ప్రభుత్వం తెలిపింది.

విభజన చట్టంలోని అన్ని అంశాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని….
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్ల్లు పూర్తి కావటంతో విభజన చట్టంలోని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసిందని ప్రభుత్వం తెలిపింది. ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ జూన్ 2 వ తేదీ నుంచి తెలంగాణకు ప్రత్యేక రాజధానిగా ఏర్పడిందని, ఇదే సందర్భంగా ఎపికి కేటాయించిన ఆఫీసులు, భవనాలతో పాటు విభాగాల వారీగా విభజన చట్టంలోని అన్ని అంశాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని తెలిపింది. పెండింగ్‌లో ఉన్న అంశాలపై తదుపరి చర్చలు, సమావేశాలు జరగలేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News