Friday, March 29, 2024

యుగ తులసి పార్టీకే రోడ్డు రోలర్… రిటర్నింగ్ అధికారిపై ఇసి సీరియస్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో యుగ తులసి పార్టీకి చెందిన కె. శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థి కె శివ కుమార్ గుర్తు రోడ్డు రోలర్  ఎందుకు మార్చారని రిటర్నింగ్ అధికారి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది.  శివకు రోడ్డు రోలర్ గుర్తు కేటాయిస్తూ ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తనకు మొదటి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి తరువాత మార్చారని కేంద్ర ఎన్నికల సంఘానికి శివ ఫిర్యాదు చేశారు.

మునుగోడు ఉప ఎన్నికలలో కారును పోలిన ఎన్నికల గుర్తులు రోడ్డు రోలర్.. కెమెరా.. చపాతీ రోలర్.. టెలివిజన్, షిప్, డోలీ వంటి ఎనిమిది గుర్తులు టిఆర్‌ఎస్ నేతలను వెంటాడుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ అసెంబ్లీ స్థానంలో రోడ్ రోలర్ గుర్తుకు 4,330 ఓట్లు వచ్చాయని, సిపిఎంకు 1,036 ఓట్లు వచ్చాయని చెప్పారు. అదేవిధంగా నర్సంపేటలో కెమెరా గుర్తుకు 9,052 రాగా, రెండు జాతీయ పార్టీలైన బిజెపి, బిఎస్‌పిలకు 2,612 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇవిఎం మెషిన్లలో కారును గుర్తించడంలో ఓటర్లను తికమక పెట్టేందుకు కారును పోలిన గుర్తులను ప్రతిపక్ష పార్టీలు సద్వినియోగం చేసుకున్నాయని టిఆర్ఎస్ నేతలు ఆరోపించారు.  గత పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరిలో కారు గుర్తును పోలిన గుర్తు ఉండటంతో కారుకు రావల్సిన ఓట్లు ట్రాక్టర్‌కు వచ్చాయి. దుబ్బాక ఎన్నికల్లో కారు గుర్తును పోలినట్లు రోటీ మేకర్ ఉండటంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఇప్పటికే ఈ గుర్తులతో దుబ్బాక, భువనగిరిలలో టిఆర్‌ఎస్ స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News