Sunday, October 6, 2024

బంగ్లాతో టెస్టు.. చెన్నైకి రోహిత్, కోహ్లీ

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ తో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు చెన్నై చేరుకున్నారు. భారత్– బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత జట్టు చెన్నైలో అడుగుపెట్టింది.

తాజాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టుతో కలిశారు. రోహిత్ ముంబై నుంచి చెన్నైచేరుకోగా, కోహ్లీ లండన్ నుంచి నేరుగా వచ్చాడు. వీరిద్దరూ చెన్నై ఎయిర్ పోర్ట్‌లో కన్పించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక, టీ20 వరల్డ్‌కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు టెస్టు సిరీస్ ఎంపికయ్యారు. బంగ్లా క్రికెట్ జ‌ట్టు కూడా శ‌నివారం ఇండియాకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News