Tuesday, June 18, 2024

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన రోనాల్డ్ రాస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్‌లో 13 ప్రాంతాల్లో 16 హాల్స్‌లో ఓట్ల లెక్కింపు జరుగనుందని హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తెలిపారు. నిజాం కాలేజీలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో రోనాల్డ్ రాస్ మాట్లాడారు.  హైదరాబాద్‌లో మూడు చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కిస్తామని, ప్రతి కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లు, జూబ్లీహిల్స్ లో అత్యధికంగా 20 టేబుళ్లు ఏర్పాటు చేశామని వివరించారు. యాకుత్‌పురాలో అత్యధికంగా 24 రౌండ్లు, చార్మినార్ నియోజకవర్గంలో 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో చేస్తామని, ప్రతి రౌండ్‌కు 30 నిమిషాల సమయం పడుతుందని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఐదు వివి ప్యాట్ల స్లిప్పులు లెక్కిస్తామని రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News