Friday, September 22, 2023

దశాబ్ది వేడుకల్లో అపశృతి..

- Advertisement -
- Advertisement -

బీర్‌పూర్: రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బీర్‌పూర్ మండల ఎంపిడిఓ కార్యాలయంలోని ఎంపిడిఓ గదిలో శుక్రవారం పై కప్పు ఒక్కసారి విరిగి పడింది. ఆ సమయంలో ఎంపిడిఓ మల్లారెడ్డి కార్యాలయం ఎదుట దశాబ్ది వేడుకల్లో భాగంగా జెండాను ఆవిష్కరించారు.

అప్పటి వరకు తన గదిలోనే ఉన్న ఎంపిడిఓ బయటికి వెళ్లగానే పై కప్పు కూలడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే ఎంపిడిఓతో పాటు సిబ్బంది కూడా గాయపడే వారని స్థానికులు తెలిపారు. అయితే పూర్తి శిలావస్థలో ఉన్న భవనంలో ఎంపిడిఓ కార్యాలయాన్ని కొనసాగించడం వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News