Saturday, August 16, 2025

రాజస్థాన్‌కి కోల్‌కతా ఆఫర్.. సంజూను ఇస్తే ఆ ఇద్దరిని ఇచ్చేస్తాం!

- Advertisement -
- Advertisement -

గత ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్ (Sanju Samson).. ప్రస్తుతం ఆ జట్టును వీడనున్నాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ కూడా ట్రేడింగ్ పద్ధతిలో సంజూను ఇచ్చేసి.. వేరేవాళ్లను జట్టులోకి తెచ్చుకోవాలని భావిస్తోందని సమాచారం. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ సంప్రదింపులు జరిపిందట. సంజూని తీసుకొని.. రవీంద్ర జడేజా కానీ, శివమ్ దూబేని కానీ తమకు ఇవ్వాలని రాజస్థాన్ కోరిదట. కానీ, అందుకు సిఎస్‌కె అంగీకరించలేదని టాక్. ఇప్పుడు సడెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఈ రేసులోకి వచ్చింది.

2024 ఐపిఎల్‌లో ట్రోఫీని అందించిన శ్రేయస్ అయ్యర్‌ని వదులుకున్న కెకెఆర్ జట్టు ఈ ఏడాది సారథ్య బాధ్యతలను అజింక్యా రహానేకి అప్పగించింది. కానీ, ఈ సీజన్‌ జట్టుకు అంతగా కలిసి రాలేదు. దీంతో సంజూని (Sanju Samson) తమ జట్టులోకి తీసుకోని వచ్చే ఐపిఎల్‌లో అతనికి కెప్టెన్సీ ఇవ్వాలనే ఆలోచనలో కోల్‌కతా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సంజూని రాజస్థాన్ జట్టు రూ.18 కోట్లకు గత సీజన్‌లో అట్టిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో కెకెఆర్ ఇద్దరు ప్లేయర్లను ట్రేడింగ్ చేసినా.. రాజస్థాన్‌కు ఇంకా భారీ మొత్తంలో నగదు సమర్పించుకోవాలి.

కెకెఆర్ గత సీజన్‌లో రూ.3 కోట్లకు రఘువంశీని, రూ.4 కోట్లకు రమణ్‌దీప్ సింగ్‌ని తీసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరిని రాజస్థాన్‌కు ఇచ్చినా.. మరో రూ.11 కోట్లు డబ్బు ఇవ్వాలి. అలా సంజూని జట్టులోకి తీసుకొని.. అతనికి కెప్టెన్సీ ఇచ్చే ఆలోచనలో కెకెఆర్ ఉన్నట్లు సమాచారం. రహానే ఇంకొన్ని సీజన్లు ఆడే అవకాశం లేదు. దీంతో సంజూనే జట్టు కెప్టెన్‌గా మరియు.. భారత వికెట్ కీపర్ స్థానం ఖాళీగా ఉంది కాబట్టి.. అది కూడా సంజూకి కలిసొచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News