Sunday, December 15, 2024

రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారిపై రూ.2,000 జరిమానా

- Advertisement -
- Advertisement -

రాంగ్‌రూట్, హెల్మెట్‌పై హైదరాబాద్ పోలీసులు మంగళవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. నగరంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. చాలామంది బైక్ రైడర్లు హెల్మెట్ ధరించకుండా, రాంగ్‌రూట్‌లో రావడంతో ముగ్గురు మృతిచెందారు. బైక్ రైడర్లు ఐఎస్‌ఐ మార్క్ ఉన్న హెల్మెట్లు ధరించాలని పోలీసులు ఆదేశించారు. సాధారణ హెల్మెట్లు పెట్టుకున్నా కూడా రోడ్డు ప్రమాదాల్లో సేఫ్ కాదని పేర్కొన్నారు. నగరంలో తిరుగుతున్న 40శాతం మంది హెల్మెట్లు ధరించడంలేదని పోలీసులు పేర్కొన్నారు.

హెల్మెట్ లేకుండా రైడ్ చేసేవారికి మూడు రెట్లు ప్రమాదం ఎక్కవని తెలిపారు. బైక్ రైడర్లు 100శాతం హెల్మెట్ ధరించేలా చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ట్రాఫిక్‌పై అవగాహన తరగతులు నిర్వహించామని, సోషల్ మీడియాలో విస్కృతంగా ప్రచారం నిర్వహించామని తెలిపారు. హెల్మెట్ ధరించని వారిపై ఎంవి యాక్ట్ ప్రకారం రూ.200 జరిమానా, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారిపై రూ.2,000 జరిమానా విధించనున్నట్లు ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News