వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం, రంగాపురం పొగాకు కంపెనీ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రంగాపురం గ్రామానికి చెందిన పెండ్లి రాముడు (68) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మసీద్ శేఖర్ (58) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా హైవే అంబులెన్స్‌లో వనపర్తి ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్త్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. పొలం పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రంగాపురం గ్రామానికి చెందిన పెండ్ల్లి రాముడు,
మసీద్ శేఖర్ పొగాకు కంపెనీ దగ్గర క్రాస్ రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న టిఎస్‌ఆర్‌టిసి సూపర్ డీలర్స్ బస్సు వేగంగా ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. అంతేకాకుండా గ్రామంలో ఇదే నెలలో నలుగురు వ్యక్తులు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎనుముల రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు.