Monday, December 4, 2023

డిసిఎంను ఢీకొన్న ఆర్టీసి బస్సు..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి : ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు సమీపంలో ఆగి ఉన్న డిసిఎంను ఆ ర్టీసి బస్సు బలంగా ఢీకొన్న ఘటన గురువారం ఇబ్రహీంపట్నం పో లీస స్టేషన్ పరధి చోటు చేసుకుంది.సిఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… రోజు మాదిరిగా ఉదయం సుమారు 9 గంటల ప్రా ంతంలో ప్రవేటు ఆర్టీసి బస్సు నెంబర్: టిఎస్ 07 యుజి 7172 గల బస్సు హైదరాబాద్‌కు వెళుతున్న సమయంలో పట్నం పెద్ద చెరువు కట్టపై ఓ డిసిఎం ఆగి ఉండడంతో వెనుకనుండి ప్రైవేట్ ఆర్టీసి బస్సు బలంగా ఢీ కొనడంతో బస్సులో ఉన్న కండక్టర్ బుగ్గరాములు,

8 మంది మంది ప్రయాణికు లు మంగమ్మ, సుమలత, మల్లమ్మ, లక్ష్మమ్మ, జంగయ్య ,జగదీష్వర్ తీవ్రంగా గాయలైనాయి. వెంటనే ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రికి తరళించా రు.కండక్టర్‌కు బలంగా గాయాలు కావడంతో నగరంలోని తార్నాక ఈఎస్‌ఐ ఆస్పత్రికి మెరుగైనా వైద్యం అందించేందుకు తరళించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామక్రిష్ణ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News